అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్ష వర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు సోమవారం నిర్వహించిన " స్పందన " కార్యక్రమంలో 60 పిటీషన్లు స్వీకరించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించి , సత్వరమే చట్ట పరిధిలో వారికి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్.పి గారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలపై పిటీషన్లు అందజేశారు.