దేశంలో రైతుసంఘాల ఆందో నతో వ్యవసాయ చట్టాలను రద్దుచేసిన ప్రధాని మోదీ విద్యుత్ సవరణ బిల్లు - 2020ను వెంటనే ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్రసమితి సభ్యుడు వంగిమళ్ళ రంగారెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి, సీపీఐ రాయచోటి ఏరియా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవ సాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లు-2020ను కూడా అమలులోకి తెచ్చిందన్నారు. దేశవ్యాప్త రైతాంగం ఆందోళనతో ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను రద్దుచేసి విద్యుత్ సవరణబిల్లును మాత్రం రద్దు చేయలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా మరిన్ని ఆందోళనా కార్యక్రమాలను చేప ట్టనున్నట్లు వారు వివరించారు. అనంతరం కలెక్ట ర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం రాయచోటి మండల అధ్యక్షుడు. వెంకట్రామరాజు, కార్యదర్శి వెంకటరమణ, షబ్బీ ర్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.