రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామంలో పుణ్యక్షేత్రమైన సంజీవరాయ, చెన్నకేశవ, భీమలింగేశ్వర ఆలయానికి నూతన రథశాలను నిర్మించేందుకు రూ. 20 లక్షలతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కానాల విజయలక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకుడు కాణాల బలరాం రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, జడ్పిటిసి సభ్యురాలు జీరెడ్డి అంజనీకుమారి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకుడు కాకర్ల నాగ శేషారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.