వైఎస్ఆర్ కడప జిల్లా, కమలాపురం: గోటూరు గ్రామానికి చెందిన నూతేటి ప్రసాద్ (29) గోటూరు చెరువులో పడి మృతిచెందారు. ప్రసాద్ పశువులను మేపడానికి పొలాల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో పశువులు నీరు తాగేందుకు చెరువులోకి దిగి ఎంతసేపటికి బయటికి రాలేదు. పశువులను చెరువులోంచి బయటకు తోలేందుకు ప్రయత్నిస్తూ పొరపాటున నీటిలోకి దిగారు.
నీరు లోతు ఎక్కువుగా ఉండడంతో మునిగిపోయి మృతిచెందారు. ప్రసాద్ కు చాపాడు మండలం వి. రాజపాలెం గ్రామానికి చెందిన భారతితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.