వైఎస్ఆర్ కడప జిల్లా: కమలాపురం పట్టణంలోని 45వ వార్డుల్లో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెన్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్టీ కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆలయం అసంపూర్తిగా ఉందని, విద్యుత్తు తీగలు సరిగాలేక సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఉపాధి కల్పించాలని మహిళలు, యువకులు ఎమ్మెల్యేకి విన్నవించారు.
అనంతరం విద్యుదాఘా తంతో మృతిచెందిన కమలాపురానికి చెందిన భూపానం సుబ్రహ్మణ్యం సతీమణి హైమావతికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. లక్ష చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. నాయకులు ఉత్తమారెడ్డి, ఎన్సీ పుల్లారెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.