కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు భారత్ కు తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు వల్ల గత రెండేళ్లుగా ఇక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.