విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సిఎం జగన్ రెడ్డి గారికి, టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ లేఖ రాసినట్లు తెలియజేసారు. ఈ లేఖలో .... ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల కోసం ఆనాడు కార్చింది మొసలి కన్నీరు అని నేటి మీ నిర్లక్ష్య వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. పాదయాత్రలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల దీక్ష శిబిరాల వద్దకి వెళ్లారు. ప్రతీ జిల్లాలోనూ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు మీకు ఇచ్చినప్పుడు ఏ హామీలిచ్చారో మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను.
మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్హత, అనుభవం, సర్వీసుని పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేస్తామని, యాజమాన్యానికి-కార్మికులకు మధ్య ఉన్న దళారీ వ్యవస్థని రద్దు చేసి విద్యుత్ సంస్థ నుంచే జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులని రెగ్యులర్ చేయాలి, థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు చేసి, యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని తెలిపినట్లు తెలియజేసారు.