భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 2022లో మహిళల సింగిల్స్ ప్రారంభ రౌండ్‌లో హాంకాంగ్‌కు చెందిన చియుంగ్ న్గాన్ యిపై గెలిచింది. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సైనా మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపించింది. ఆమె 21-19, 21-9 వరుస సెట్లలో చియుంగ్ న్గాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ను సైనా కేవలం 38 నిమిషాల్లోనే ముగించింది. కాకపోతే సైనా 2వ రౌండ్‌కు బదులుగా నేరుగా మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్‌లో ఆమె ప్రత్యర్థి, జపాన్‌కు చెందిన 6వ సీడ్ నొజోమి ఒకుహరా వివిధ కారణాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో సైనాకు లైన్ క్లియర్ అయింది. ఆమెకు 3వ రౌండ్‌కు బై లభించింది. సైనా మూడో రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన 12వ సీడ్ బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌తో మరియు తన రెండవ రౌండ్ మ్యాచ్ విజేతతో జర్మనీకి చెందిన వైవోన్ లీతో తలపడుతుంది.