తుపాకులకు గుండెలు ఎదురొడ్డి హక్కులు కాపాడుకోవడం, అణిచివేతపై రాజీలేని పోరాటం "ఆంధ్రకేసరి" మనకందించిన స్ఫూర్తి. ఆయన బాటలో నడిచి మన హక్కులు కాపాడుకోవడమే ఆంధ్రకేసరికి మనం అందించే నివాళి అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రకాశంగారి జయంతి సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధునిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకుందాం అని పిలుపునిచ్చారు.