UAEలో జరగనున్న ఆసియా కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు మంగళవారం (ఆగస్టు 23) ఉదయం దుబాయ్ చేరుకుంది. మూడు వన్డేల కోసం పాక్ జట్టు నెదర్లాండ్స్‌కు వెళ్లింది. అక్కడ సిరీస్ క్లీన్ స్వీప్ చేసి అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్నారు. ఈ టీమ్‌లో లేని ఇఫ్తికార్ అహ్మద్, ఉస్మాన్ ఖాదిర్, హైదర్ అలీ, ఆసిఫ్ అలీ లాంటి వారు లాహోర్ నుంచి దుబాయ్ వచ్చారు. నెదర్లాండ్స్ పర్యటనకు పాక్ జట్టులో ఉన్న అబ్దుల్లా షఫీక్, ఇమాముల్ హక్, మహ్మద్ హరీస్, సల్మాన్ అలీ, జాహిద్ మహమూద్‌ల స్థానంలో వారు జట్టులోకి వచ్చారు. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారిలో కెప్టెన్ బాబర్ ఆజం, ఇతర ఆటగాళ్లు ఉన్నారు. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది స్థానంలో ఎంపికైన మహ్మద్ హస్నైన్ బ్రిటన్ నుంచి రానున్నాడు. ఆదివారం (ఆగస్టు 28)న భారత్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్, దుబాయ్‌లో టీమిండియా కోసం ఎదురుచూడనుంది. భారత్, పాకిస్థాన్‌తో పాటు క్వాలిఫయర్ గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఇప్పటికే క్వాలిఫయర్స్ టోర్నీ ప్రారంభమైంది.