మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. వ్యాపారం మీద ఆశతో మాంత్రికుడు చెప్పిన మాటలను నమ్మి ఓ వ్యాపారి తన భార్యకు అందరి ముందు నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. ఈ దుర్మార్గపు పనికి అతని తల్లితండ్రులు కూడా సహకరించారు. భర్త ఒత్తిడి తట్టుకోలేక చెప్పినట్టు చేశానని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్త, అత్తమామాలను అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడు పరారీలో ఉన్నాడు.