ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహిళను ట్రైన్ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.