శ్రీకాళహస్తి పట్టణంలో పురాతన కాలం నాటి వీధులు, రోడ్లు ఉన్నాయి. జనాభా పెరిగినా రోడ్ల వెడల్పు పెరగలేదు. ఇలాంటి సమయంలోనే రోడ్ల మీదకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటుంటే జనం ఇబ్బంది ఎవరు గుర్తించాలని సీఐ అంజూయాదవ్ ప్రశ్నించారు. మంగళవారం శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ తదితరులతో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్ల మీద ఉన్న దుకాణాలను వెనక్కి జరపాలని సూచించారు.