ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ రెండు టవర్లను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయనున్నారు. ఇందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. రెండు టవర్లలో పేలుడు పదార్థాలను అమర్చడం పూర్తైంది. నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్‌టెక్ కంపెనీ 2009లో రూ.70 కోట్లతో ఈ టవర్లను కట్టింది. ఇప్పుడు వాటిని కూల్చివేయడానికి రూ.20కోట్లు ఖర్చు అవుతోంది.