రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు మరోసారి క్రిమియా చుట్టూ తిరుగుతోంది. ఉక్రెయిన్ ఇకపై రష్యాతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. క్రిమియాని తిరిగి స్వాధీనం చేసుకుంటే యుద్ధానికి తెరపడుతుందన్న భావనలో ఉక్రెయిన్ ఉంది. ఇందుకోసం తన వ్యూహాలను మార్చుకుంటూ క్రిమియా లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. క్రిమియాతో మొదలైన యుద్ధం క్రిమియాతోనే ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.