జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని హీరానగర్ ప్రాంతంలో మంగళవారం బీజేపీ నేత మృతదేహం అనుమానాస్పద పరిస్థితులలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. బాధితుడిని సోమ్ రాజ్‌గా పోలీసులు గుర్తించారు. శరీరంపై రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయనను హత్య చేసి ఉంటారని సోమ్ రాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.