బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నెల 28న లిస్ట్ లోని క్రమసంఖ్య 1 నుంచి 500 వరకు, 29న క్రమసంఖ్య 501 నుంచి 1000 వరకు, ఈనెల 30న 1001 నుంచి 1404 వరకు విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరు కావాలని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్లతో ఉ.9 గంటల వరకు ట్రిపుల్ ఐటీ కాలేజీలో హాజరు కావాలన్నారు. కౌన్సెలింగ్ కు రాకపోతే సీటు కోల్పోతారని చెప్పారు.