యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు తనను బడికి పంపుతున్నారని టెన్త్ చదివే బాలుడు (15) దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఎనిమిదో తరగతి చదివే నీరజ్ (13) అనే బాలుడిని సోమవారం గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. జైలుకెళ్తే చదువు బాధ తప్పుతుందని ఇలా చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయిన పోలీసులు అతడిని జువైనల్ హోంకు తరలించారు.