ఆకుకూరలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆకుకూరల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఆకుకూరలు శరీరానికి అవసరమైన అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు మరియు ప్రోటీన్లను అందిస్తాయి. మనం రోజువారీ ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవడం వల్ల మన శరీరానికి శక్తి లభిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు ఆకుకూరలు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆకుకూరలు తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.