కనేకల్లు: ఎస్. హనుమాపురం వద్ద ఉరవకొండ ప్రధాన రహదారిపై ఓ కారు షార్ట్ సర్క్యూట్ కు గురై తగలబడింది. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు నలుగురు గురువారం పావగడకు వెళుతుండగా కారులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ప్రయాణిస్తున్న వారు కారు దిగారు. కొద్ది సేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది.