ఇటలీకి చెందిన ఓ 36 ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్, హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇలాంటి కేసు నమోదవ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి. బాధితుడు ఇటీవల స్పెయిన్ కు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నడుము వాపుతో బాధపడుతున్నాడు. కొద్దిగంటల్లోనే అతని చేతిపై బొబ్బలు కనిపించాయి. డాక్టర్లు టెస్టులు చేయగా కరోనా, మంకీపాక్స్ తో పాటు హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది.