ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమైన నేపథ్యంలో ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ గురువారం ఏపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన చర్చలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఈ సమావేశంలో తమ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించిందని ఏపీ ప్రతినిధి బృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa