శ్రీకాకుళం: నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బూరెల్లి శంకర్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డులో రూ. లక్ష విలువైన సింగిల్ యూత్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్లు, కప్పులును గురువారం రెండవసారి దగ్ధం చేశారు. పట్టణంలో గతంలో దాడులు నిర్వహించామని తిరిగి మరల పంచాయతీ సిబ్బంది దుకాణాలపై నిర్వహించిన దాడుల్లో మరో లక్ష రూపాయలు నిలువలను కనుగొన్నామని అన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ పట్టణంలో మరి కొంతమంది వ్యాపారస్తులు వద్ద నిలువలు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీటిని కూడా సేకరించి స్థానిక డంపింగ్ యార్డ్ లో దగ్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా ప్లాస్టిక్ వస్తువులు వినియోగం చేసినట్లయితే వారే స్వచ్చందంగా ముందుకు రావాలని తమకు అప్పగించాలని స్పష్టం చేశారు.