శనగలు ఐరన్ లోపం సమస్యను దూరం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కండరాలు, ఎముకలను బలంగా చేస్తాయి. శనగల్లోని సి విటమిన్ శరీరం ఐరన్ ను పీల్చుకునేలా దోహదపడుతుంది. వీటిలో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం, అధిక బరువు సమస్యలకు చెక్ పెడతాయి. వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయులను సమన్వయం చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రాకుండా పరిరక్షిస్తాయి.