ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమలం విఫలమైందని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు.