కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు దుండగుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. టిప్పు సుల్తాన్ను కానీ, ముస్లిములను కానీ తిడితే నాలుక కోసేస్తామని నిందితులు లేఖలో పేర్కొన్నారు. తోక ఊపొద్దని హెచ్చరించారు. కన్నడ భాషలో రాసిన ఆ లేఖ పట్ల ఈశ్వరప్ప స్పందించారు. ఇలాంటి లేఖలకు తాను బెదిరేది లేదన్నారు. జిల్లా ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు.