ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో హై బీపీ అనేది అందరిలో సాధారణం అయిపోయింది. అయితే తరచూ అరటి పండ్లు తినే వారిలో దానిలో లభించే పొటాషియం వల్ల హైబీపీ అదుపులో ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యుల సలహాతో పరిమితంగా తినాలి. వీటితో పాటు ఆకుకూరలు, బచ్చలికూర, పుచ్చకాయలు, నారింజ, దుంపలు, ఓట్స్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.