యూట్యూబ్ ఛానల్ 'ఘర్షణ' నిర్వాహకుడు వెంగళరావు తనకు పోలీస్ కస్టడీలో ఎదురైన చిత్రహింసలను శుక్రవారం జడ్జి ముందు ఏకరవు పెట్టాడు. శాంతి భద్రతలకు విఘాతం పేరుతో తనను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని బాధితుడు చెప్పాడు. కస్టడీలో దుస్తులు విప్పి కొట్టారని, తన ప్రైవేట్ పార్ట్స్‌లో కర్రతో గాయాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. విషయం కోర్టులో చెప్తే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని వాపోయాడు.