జగిత్యాల పట్టణంలోని 35, 41, 43, 44, 45 వార్డుల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన 315 ఆసరా పెన్షన్లను జగిత్యాల పట్టణ గీతా భవన్ లో లబ్ధిదారులకు పెన్షన్ కార్డ్ లను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అందజేశారు. అనంతరం వార్డు లకు చెందిన 7 గురు లబ్ధిదారులకు 1లక్ష 50వేల సీఎం సహాయ నిధి చెక్కులు, 11 మంది ఆడబిడ్డలకు 11 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అందించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కమిషనర్ స్వరూప రాణి, జిల్లా కౌన్సిలర్ ఫోరం అధ్యక్షులు పంబాల రామ్ కుమార్, కౌన్సిలర్ లు కప్పల శ్రీకాంత్, బోడ్ల జగదీష్, జయ శ్రీ, పిర్దొస్ తరున్నం, పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, అల్లే గంగ సాగర్, చాంద్ పాషా, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, బండారి నరేందర్, బోలుసని
శ్రీనివాస్, కొలగాని సత్యం, ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, నాయకులు, అధికారులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.