తెలుగు ఇండస్ట్రీలో హీరోగా, కమెడీయన్ గా రాణిస్తున్న అలీకి త్వరలో అల్లుడు రాబోతున్నాడు. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టనుంది. ఫాతిమా, షేక్ షెహ్యాజ్ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఫాతిమా ఇటీవలే వైద్య విద్య పూర్తిచేసింది. ఆమెను పెళ్లాడబోయే షెహ్యాజ్ కూడా డాక్టరే. అతడి కుటుంబంలో చాలామంది వైద్యులే. త్వరలోనే ఫాతిమా, షెహ్యాజ్ ల పెళ్లి నిశ్చయించారు. హైదరాబాద్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ నుంచి సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, నటుడు సాయికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ ఎంగేజ్ మెంట్ వీడియోను అలీ అర్ధాంగి జుబేదా తన యూట్యూబ్ చానల్ ద్వారా పంచుకున్నారు.