చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నలగాంపల్లె గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ (42) ఆత్మహత్య చేసుకుంది. శనివారం విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో చిత్తూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అసమె మృతి చెందింది. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.