విజయవాడ పోలీసులు ఆపరేషన్ సీపీఎసకు శ్రీకారం చుట్టారు. సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు వచ్చే నెల ఒకటిన విజయవాడలో భారీ ర్యాలీకి
పిలుపు నిచ్చారు. ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగులు ఇచ్చిన వినతిని పోలీసులు తిరస్కరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144, 30 అమలు చేస్తున్నారు. నగరంలో లాడ్జీలు, - హాస్టళ్లను పోలీసులు జల్లెడపట్టారు.