గోదావరి ఉగ్రరూపం, వరదల వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, వీఆర్ పురం మండలాల్లో.. ఆగష్టు 10న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షను నిర్వహించలేదు. దీంతో 270 మంది విద్యార్థులు కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలను రాయలేకపోయారు. తర్వాత కూడా వరదల వల్ల పరీక్ష నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో ఆ 270 మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని అధికారులు నిర్ణయించారు.