ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ ఇప్పటివరకు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇండియా 8, పాకిస్తాన్ 5 మ్యాచ్ ల్లో నెగ్గగా.. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇక చివరిసారిగా 2 జట్లు గతేడాది టీ20 ప్రపంచ కప్ లో తలపడగా.. పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో పాక్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడే అవకాశం ఉంది.
అయితే ఇరుజట్లు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నాయి. అయితే రెండు జట్లకు ప్రధాన పేసర్లు గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ఇరుజట్లకు బౌలింగ్ విభాగం కీలకం కానుంది. ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టుకే విజయం దక్కుతుంది. ఓవరాల్ గా చూస్తే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు భారత్ కే ఎక్కువగా ఉన్నాయి. టీమిండియాకు భువి, అర్షదీప్, చాహల్ కీలకం కానున్నారు.