సీపీఎస్ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా శనివారం తెలిపారు. నగరంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు వివిధ రకాల నిరసన కార్యక్రమాలకు విజయవాడ నగరంలో పిలుపు ఇచ్చారని, ఈ కార్యక్రమాలకు స్థానిక పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు లేవని పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు.