తలపై సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటివి సహించేది లేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి అయన మాట్లాడుతూ ఎటువంటి అభివృద్ధి పనులు చేసిన, ఆ కార్యక్రమానికి ఏదో ఒక విధానములో ప్రజలలోనికి తప్పుడు సంకేతాలు అందించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఆ విధంగా వ్యవహరిస్తున్నది ఎవరో తనకు తెలుసని అన్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమమైన ప్రారంభించే సందర్భంగా ప్రోటోకాల్ ను అధికారులు నిర్ణయిస్తారని, ఆ విధంగానే శిలాఫలకములను రూపొందిస్తారనే విషయము తెలియక కొంతమంది తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
తనది ఎప్పుడు నా పేరు ఉండాలని గాని, నా గురించి ప్రచారం చేయాలనుకునే మనస్తత్వం కాదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటే కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. దొడ్డిదారిలో సోషల్ మీడియా ద్వారా లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.
ఇలాంటి కుళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటానని నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. ఇటీవల ఒంటిమిట్టలో ప్రారంభించిన ఓ కార్యక్రమంలో అనవసరంగా సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పించి మెసేజ్ లు పెట్టే వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. వారిపై అన్నమయ్య, వైయస్సార్ జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ఎత్తుగడలను తిప్పి కొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వివరించారు.