ఓ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో ఆదివారం దారుణం జరిగింది. సిద్ధార్థ్ అనే వ్యక్తి కుటుంబంతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో భార్య అదితి శర్మ (37), ఎనిమిదేళ్ల కుమార్తె, అత్త మాయాదేవి (60)లను కత్తితో పొడిచాడు. కుటుంబ విభేదాలే దాడికి కారణమని భావిస్తున్నట్లు డీసీపీ (తూర్పు) ప్రియాంక కశ్యప్ తెలిపారు. బాధితులను ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.