బెల్లంలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఎదిగే పిల్లల్లో ఎముకలు పటిష్టంగా ఉండేందుకు దోహదపడుతుంది. బెల్లాన్ని వేరుశెనగతో పాటు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ బెల్లం తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి. శ్వాసకోశ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కడుపు, ఊపిరితిత్తుల్లోని మలినాలను శుభ్రం చేస్తుంది.