కానిస్టేబుల్ రాతపరీక్షలో గందరగోళం నెలకొంది. 'సీ' సిరీస్ బుక్ లెట్ వచ్చిన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఓఎంఆర్ షీట్ కొచ్చన్ బుక్ లెట్ కోడ్ బబుల్ కోసం 1 నుంచి 5 నంబర్లుంటాయి. కోడ్ ను బట్టి ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయాలి. కానీ 'సీ' సెట్ బుక్ లెట్ వచ్చిన అభ్యర్థులకు ఇచ్చిన క్యూబీ కోడ్ లో 6వ అంకె ఉంది.దీనిపై ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పరీక్ష అయితే రాయండని సూచించారు.