మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతికి మంత్రి కాన్వాయ్ వస్తోంది.ఎం.కొత్తపల్లి(నడింపల్లి) సమీపిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న మరో రోడ్డువైపు దూసుకెళ్లింది. ముందు వాహనంలో మంత్రి ప్రయాణిస్తుండటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని రోడ్డుపక్కకు తప్పించారు.