డెహ్రాడూన్లోని రాణి పోఖారీలో సోమవారం ఘోరం జరిగింది. మహేష్ కుమార్ తివారీ అనే పూజారి తన కుటుంబంలో ఐదుగురిని హత్య చేశాడు. తల్లి బితాన్ దేవి (75), భార్య నీతూ దేవి (36), కుమార్తెలు అపర్ణ (13), అన్నపూర్ణ (9), స్వర్ణ (11)లను కత్తితో గొంతు కోసి చంపాడు. భయకంపితులైన ఇరుగు పొరుగు వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.