ఏపీలోని ఎస్సీ శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తోంది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణం దారుణమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించి, ఎస్సీ శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది.