కరోనా వైరస్ ప్రతాపం కాస్త తగ్గుముఖం పట్టిందనుకోని సంతోషించే లోపు ఫ్రాన్స్‌లో బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. ఫ్రాన్స్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఓ బాతుల ఫామ్‌లో ఏవియన్ ఇన్‌ప్లూఎంజా అనే అత్యంత వ్యాధికారక బర్డ్ ఫ్లూని గుర్తించడం వల్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వల్ల ఫామ్‌లో ఉన్న 10,600 బాతుల్ని అధికారులు చంపేశారు.