దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 861.25 పాయింట్ల నష్టంతో 57,972.62 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 17,312.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 79.97 గా ఉంది. ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, మారుతీ, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండస్ ఇండ్, హెచ్ డీఎఫ్ సీ షేర్లు నష్టపోయాయి.