పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌లో నిర్మిస్తున్న 'వేదిక్ ప్లానిటోరియం' ఆలయం ప్రపంచంలోనే మతపరమైన అతిపెద్ద ఆలయంగా చరిత్రలో నిలిపోనుంది. ఈ ప్లానిటోరియం నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న డూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. దాదాపు రూ.800 కోట్లను ఖర్చు చేసి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ ఆలయాన్ని 2022లోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.