ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం అర్థరాత్రి అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సక్సేనా 2016లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు స్కామ్ చేశాడని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. రూ.1,400 కోట్ల నల్లదనాన్ని వైట్ మనీగా మార్పించారని ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.