ముందుగా ఫేస్‌వాష్ తో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఓ గిన్నెలో 6 గ్లాసుల మరిగిన నీటితో నింపి అందులో గుప్పెడు గులాబీరేకులు, పల్చని చక్రాలుగా కోసిన నిమ్మకాయ ముక్కలను వేయాలి. దీనిని 10 నిమిషాలు ఆవిరిపట్టాలి. ఇలా చేస్తే ర్మరంధ్రాల్లో పేరుకొన్న మురికి, అదనపు నూనె బయటకు పోతాయి. ఈ హెర్బల్ స్టీం ముఖచర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మ, గులాబీరేకుల నుంచి వచ్చిన ఆవిరి చర్మానికి మెరుపునిస్తుంది.