రోడ్డుపై డబ్బులు కనిపించినప్పుడు వాటిని తీసుకోకపోవడమే ఉత్తమమం అంటున్నారు పండితులు. ఒకవేళ వాటిని తీసుకున్నా కానీ, దేవుని హుండీలో వేయడమో, లేక ఎవరికైనా దానం చేయడమో చేయాలంట. ఎందుకంటే డబ్బులు పొగొట్టుకున్న వారు, మనీ పోయాయని చాలా బాధ పడుతుంటారు. అయితే వాటిని మనం తీసుకోవడం వలన వారి బాధ మనకు కలిగే అవకాశం ఉందంట. దాంతో వారు కష్టపడిన సొమ్ము మనం తీసుకొని ఖర్చుచేస్తే పాపం చుట్టుకుంటుందని అంటున్నారు పండితులు.