ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పరీక్షా ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్
www.tsbie.cgg.gov.in లో లాగిన్ అవ్వాలని విద్యార్థులకు బోర్డు సూచించింది.