ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగంగా సింగిల్ విండో విధానంలో ఒబెరాయ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒబెరాయ్ ప్రెసిడెంట్ రాజారామన్ సీఎంతో సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో విశాఖ, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్‌లో లగ్జరీ రిసార్ట్స్ ఏర్పాటుకు ఒబెరాయ్ ఆసక్తి చూపారు. ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి లభించనుంది.